![]() |
![]() |

హీరోయిన్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ మేరకు పెర్ఫార్మ్ చెయ్యడం తప్పనిసరి. ఆ విషయంలో ఇంకో మాటకి తావు ఉండదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆమె ప్లేస్ లో మరొకరు ఉంటారు. అందుకే గ్లామర్ ప్రపంచమైన సినీ రంగంలో అడుగుపెట్టాక తమ కెరీర్ కోసం ఎలాంటి రోల్స్ చేయడానికి అయినా సిద్ధపడుతుంటారు. ముఖ్యంగా వెండితెరపై రొమాంటిక్ సీన్స్, ముద్దు సీన్లు చేయడం ఈ రోజుల్లో చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే కొందరు నటీమణులు మాత్రం పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి, వైవాహిక బంధానికి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది.
తాజాగా పాకిస్థానీ ప్రముఖ నటి ఫైజా అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారాయి. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'పెళ్లి తర్వాత రొమాంటిక్ సీన్స్‌లో నటించడాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నాను. సినిమాల్లో నటించడం నా వృత్తి అయినప్పటికీ, నిజ జీవితంలో నా కంటూ కొన్ని నైతిక విలువలు, కట్టుబాట్లు ఉన్నాయి. పెళ్లయిన తర్వాత ఒక నటిగా స్క్రీన్ పైన రొమాన్స్ చేయడం నా వ్యక్తిత్వానికి సరిపడదు. వివాహమై ఒక భర్త ఉన్నప్పుడు, కేవలం సినిమా కోసమో లేదా స్క్రిప్ట్ డిమాండ్ చేసిందనో మరో హీరో చేతుల్లోకి వెళ్లడం, అతడితో క్లోజ్ గా మూవ్ అవ్వడం నేను అసలు ఊహించుకోలేను. నా మనస్సాక్షి దానికి ఒప్పుకోదు. ఈ నిర్ణయం వల్ల అవకాశాలు తగ్గినప్పటికీ ఏమాత్రం బాధపడటం లేదని చెప్పుకొచ్చింది.
also read: స్టార్ మెటీరియల్ గా నిలుస్తాడా?
![]() |
![]() |